- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నందిగం రాణికి బిగ్ షాక్.. పిటిషన్ డిస్మిస్
by Vemula.Srinu Prasad |
విద్యా సంస్థల్లో భారీ మోసానికి పాల్పడిన నందిగం రాణికి బిగ్ షాక్ తగిలింది....

X
దిశ, వెబ్ డెస్క్: విద్యా సంస్థల్లో భారీ మోసానికి పాల్పడిన నందిగం రాణికి బిగ్ షాక్ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది.
అయితే ఈ కేసులో ఇప్పటికే నందిగం రాణి ఆస్తులను హోంశాఖ అటాచ్ చేసింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ సైతం డిస్మిస్ కావడంతో ఆమెను భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం తడికిపూడికి చెందిన నందిగం రాణి.. విద్యా సంస్థల్లో పెట్టుబడులు పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. ఈ మొత్తానికి ఏడాదికి 24 శాతం వడ్డీ, లాభాల్లో 5 శాతం వాటా ఇస్తానని చెల్లించకపోవడంతో బాధితులు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది.
Next Story






