Nandamuri Tarakaratna సినీ ఎంట్రీ ఒక రికార్డ్

by Vemula.Srinu Prasad |

నందమూరి తారక రత్న సినీ ఎంట్రీ రికార్డు స్థాయిలో జరిగింది. 2001లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో అరంగేట్రం చేసిన తారకరత్న.. ఆ సినిమా ప్రారంభం రోజేనే మరో 8 చిత్రాలు మొదలు పెట్టారు..

Nandamuri Tarakaratna సినీ ఎంట్రీ ఒక రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారక రత్న సినీ ఎంట్రీ రికార్డు స్థాయిలో జరిగింది. 2001లో 'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో అరంగేట్రం చేసిన తారకరత్న.. ఆ సినిమా ప్రారంభం రోజేనే మరో 8 చిత్రాలు మొదలు పెట్టారు.ఆ తర్వాత 15 సినిమాల్లో నటించారు. ఆయన సినీ ప్రస్థానంలో మొత్తం 23 సినిమాలు చేశారు. ఒక వెబ్ సిరీస్‌లోనూ తారకరత్న నటించారు. ఎన్టీఆర్ ఐదవ కుమారుడు మోహనకృష్ణ, శాంతి దంపతులకు 1983 ఫిబ్రవరి 22న తారక రత్న జన్మించారు. తారకరత్నకు చెల్లెలు నందమూరి రూప ఉన్నారు. నందమూరి తారకరత్న 2012లో అలేఖ్యారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలేఖ్యారెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డి భార్య చెల్లెలి కూతురు. తారకరత్నకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా ఒకటో నెంబర్ కుర్రాడుతో తెలుగు సినీ పరిశ్రమకు తారకరత్న పరిచయం అయ్యారు. ఆ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్‌గా కూడా తారకరత్న నటించారు. కొద్దిరోజుల క్రితం పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. నారా లోకేశ్ యువగళానికి మద్దతుగా తారకరత్న కూడా పాదయాత్ర చేశారు. అయితే పాదయాత్రలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించారు.

Next Story