- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ జయంతి వేళ.. నారా బ్రాహ్మిణి భావోద్వేగం
నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆయన మనవరాలు నారా బ్రాహ్మణి 'బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్'ను సందర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా ఆయన మనవరాలు నారా బ్రాహ్మణి(Nara Brahmini) 'బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్'(Basavatarakam Indo American Cancer Hospital & Research Institute')ను సందర్శించారు. సమాజానికి ఎన్టీఆర్ చేసిన నిరంతర సేవ, ఆయన కన్న కలలు ఈ రూపంలో సాకారమైందన్నారు. లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుండటం కళ్లారా చూడటం తనకు ఎనలేని స్ఫూర్తిని ఇచ్చిందని తెలిపారు. ప్రజల పట్ల తన తాతకు ఉన్న అచంచలమైన ప్రేమకు ఈ సేవా సామ్రాజ్యమే సజీవ సాక్ష్యంగా నిలిచిందని బ్రాహ్మణి పేర్కొన్నారు.
ఆయన కరుణ అమూల్యం..
ఆయన మనకు అందించిన కరుణ, మానవత్వం, స్వార్థ ప్రజా సేవ అనే అమూల్యమైన వారసత్వం మనల్ని నిరంతరం ముందుకు నడిపిస్తోందని బ్రాహ్మిణి తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చూపిన మార్గం, ప్రతి ఒక్కరిలో సేవాభావాన్ని మేల్కొల్పుతూ తమ గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుందని నారా బ్రాహ్మిణి స్పష్టం చేశారు.






