అభిమానికి బాలయ్య బాబు ఆర్థిక చేయూత

by Muthe.Rajitha |   (  Updated:2025-07-25 16:28:37  IST  )

తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసి చలించిపోయిన నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna ), అతనికి భారీ ఆర్థిక సహాయం చేసాడు.

అభిమానికి బాలయ్య బాబు ఆర్థిక చేయూత
X

దిశ, వెబ్ డెస్క్ : తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసి చలించిపోయిన నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna ), అతనికి భారీ ఆర్థిక సహాయం చేసాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రిస్వామి గత కొద్ది నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్సకు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా.. అంత డబ్బులేని నిరుపేద బద్రి, వైద్యం చేయించుకోకుండానే ఇంటికి చేరాడు. ఆర్థిక సమస్యలతో చికిత్స చేయించుకోలేని అతని దీనగాథ గురించి కర్నూలు పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ బాలయ్య బాబుకు చేరవేశారు.

దీంతో వెంటనే అతనికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల LOC ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. బాలకృష్ణ సతీమణి వసుంధర స్వయంగా ఈ LOC పత్రాన్ని బద్రిస్వామికి అందజేయగా.. బాలయ్య బాబుకు రుణపడి ఉంటానని ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు.

Next Story