Allu Arjun కు Balayya Babu అభినందనలు

by Seetharam |   (  Updated:2023-08-25 17:40:12  IST  )

అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నానని అగ్రనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

Allu Arjun కు Balayya Babu అభినందనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా సోదరుడు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నానని అగ్రనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..తెలుగు సినిమా సత్తా దేశ విదేశాలలో చాటామని, విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి మన చలన చిత్ర పరిశ్రమ చేరుకోవడం సంతోషకరమైన అంశమని అన్నారు. పుష్పతో పాటూ ఆర్ ఆర్ ఆర్, ఉప్పెన సినిమాలకు కూడా పలు అవార్ఢులు దక్కడం తెలుగు వారికే గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇలా అవార్డుల వర్షం గురిపించిన సూర్తితో తెలుగు సినిమా పని చేయాలని నందమూరి బాలకృష్ణ సూచించారు.

ఇవి కూడా చదవండి :

అల్లు అర్జున్‌కి శుభాకాంక్షలు తెలుపని చరణ్ కారణం అందేన..!

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తొలి సంపాదన ఎంతో తెలుసా..?

Next Story