- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఖండ 2 విడుదల అప్పుడే.. రిలీజ్ డేట్ వెల్లడించిన నందమూరి బాలకృష్ణ
అసెంబ్లీ లాబీలో నందమూరి బాలకృష్ణ చిట్ చాట్ మాట్లాడారు. అఖండ 2 (Akhanda 2) విడుదల ఎప్పుడు అని ఆయనకు ఎదురుపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ లాబీలో నందమూరి బాలకృష్ణ చిట్ చాట్ మాట్లాడారు. అఖండ 2 (Akhanda 2) విడుదల ఎప్పుడు అని ఆయనకు ఎదురుపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగారు. ఎల్లుండి తమ్ముడు పవన్ సినిమా రిలీజ్ అవుతుందని బాలకృష్ణ తెలిపారు. అఖండ 2 డిసెంబర్ 5న విడుదలవుతుందని ఆయన వెల్లడించారు. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో తీసుకొస్తున్నామన్నారు. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని బోయపాటి శ్రీను (Boyapati Srinu) అన్నారని తెలిపారు. అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని ఆయన సూచించారు. జిల్లాకు ప్రత్యేక నిధులు అడుగుదామని మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని బాలకృష్ణ తెలిపారు. అరకు కాఫీకి (Araku Coffee) ప్రమోషన్ కల్పిస్తే గిరిజనుల ఉపాధికి లబ్ధి చేకూరుతుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. మంత్రి సంధ్యారాణి సూచనకు బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు.






