నాగార్జున వర్సిటీలోకి భారీగా వరద నీరు.. విద్యార్థుల పరిస్థితి దారుణం

by Vemula.Srinu Prasad |

గుంటూరులో కురుస్తున్న వర్షాలకు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

నాగార్జున వర్సిటీలోకి భారీగా వరద నీరు.. విద్యార్థుల పరిస్థితి దారుణం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు(Guntur)లో విస్తారంగా వర్షాలు(Rains) పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు ఈ నీళ్లు పలు చోట్ల ఇళ్లలోకి చేరాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చాలా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లపై కాలువలను తరలిపించేలా నీటి ప్రవాహ కొనసాగుతోంది. దీంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేశారు. పలు చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కిపోయాయి. నాగార్జున యూనివర్సిటీ(Nagarjuna University)లోకి నీరు చేరింది.యూనివర్సిటీ ప్రాంగణంలో అడుగు మేర నీరు ఉండటంతో హాస్టల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్ చుట్టూ నీరు చేరడంతో లోపలికి వెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నారు. నిచ్చెన సాయంతో మొదటి అంతస్తులోకి విద్యార్థులు వెళుతున్నారు. అధికారులు స్పందించి మోటర్ల ద్వారా నీటిని బయటకు తరలించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Next Story