నాగార్జున సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

by Thanuru Gopichand |

నాగార్జున జలాశయం నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయికి నీటిమట్టం చేరింది

నాగార్జున సాగర్  రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల
X

దిశ, డైనమిక్​ బ్యూరో : నాగార్జున జలాశయం నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయికి నీటిమట్టం చేరింది. నాగార్జున సాగర్​జలాశయం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు ఉంది. నీటి నిల్వ 312.04 టీఎంసీలు. జలాశయం ఇన్​ఫ్లో 65,827 క్యూసెక్కులు, అవుట్​ఫ్లో 60,644 క్యూసెక్కులు. మరో వైపు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతోంది. జూరాల, సుంకేశలు నుంచి వరద ప్రవాహం వచ్చి చేరు తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్​ఫ్లో 1,50,857 క్యూసెక్కులు, అవుట్​ఫ్లో 1,00,800 క్యూసెక్కులు.పోతిరెడ్డిపాడు రెగ్యులేటరీ నుంచి 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువగట్టు విద్యుత్​కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్​కేంద్రం నుంచి 30, 485 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 879.60 అడుగులు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు. ప్రాజెక్టు ప్రస్తు త నీటి నీల్వ 185.99 టీఎంసీలు.

Next Story