విశాఖ తీర అందాలకు ముగ్ధులైన నాగాలాండ్ సీఎం: తోట్లకొండ బౌద్ధరామ సందర్శన

by Naga Rani Yarlagadda |

నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తన వారం రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు.

విశాఖ తీర అందాలకు ముగ్ధులైన నాగాలాండ్ సీఎం: తోట్లకొండ బౌద్ధరామ సందర్శన
X

దిశ, వెబ్‌డెస్క్: నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫియు రియో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో తన వారం రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చారిత్రక ప్రాధాన్యత కలిగిన తోట్లకొండ బౌద్ధరామాన్ని సందర్శించి, అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

తోట్లకొండ చేరుకున్న సీఎంకు పురావస్తు శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. సుమారు 2000 ఏళ్ల క్రితం (క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2వ శతాబ్దం వరకు) ఈ ప్రాంతం బౌద్ధ విజ్ఞానానికి, సంస్కృతికి కేంద్రంగా ఎలా విరాజిల్లిందో అధికారులు ఆయనకు వివరించారు. అక్కడి స్థూపాలు, చైత్య గృహాలు, విహారాలు, రాతితో చెక్కిన నీటి కుంటలను (తొట్లు) ఆయన ఆసక్తిగా పరిశీలించారు. కొండపై ఉన్న వ్యూ పాయింట్ నుండి విశాలమైన బంగాళాఖాత తీరాన్ని తిలకించిన రియో, విశాఖ సాగర తీర అందాలకు అబ్బురపడ్డారు. ఈ ప్రాంతంలోని ప్రశాంతత, ప్రకృతి సౌందర్యం మనసును ఆకట్టుకున్నాయని ఆయన కొనియాడారు.

నెయిఫియు రియో ఈ నెల 18వ తేదీన విశాఖకు చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా రుషికొండలోని ఒక ప్రముఖ వెల్‌నెస్ రిసార్టులో బస చేశారు. వారం రోజుల పాటు విశాఖ పరిసర ప్రాంతాలను సందర్శించిన ఆయన, ఈ రోజు (ఏప్రిల్ 27) తన పర్యటన ముగించుకుని తిరిగి నాగాలాండ్‌కు బయలుదేరనున్నారు.

Next Story