- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మహిళల పోరాటం వల్లే మనకు పదవులు: నాగబాబు
ఆ మహిళల పోరాటం వల్లే మనకు పదవులు: నాగబాబు

దిశ, వెబ్‌డెస్క్: జనసేన క్రియాశీలక సభ్యత్వం ద్వారా గౌరవం, గుర్తింపు, నాయకత్వంతో పాటుగా భరోసా లభిస్తుందని, జనసేన పార్టీని బలపరిస్తే మనల్ని, మన కుటుంబాన్ని తద్వారా మన దేశాన్ని బలపరచినట్లేనని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) స్పష్టం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన గురువారం విశాఖపట్నంలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనసేన నాయకులకి ఈ రోజు దక్కిన పదవులు జన సైనికులు, వీర మహిళల తెగింపు వల్లనే వచ్చాయని, నాయకులు అను నిత్యం ప్రతీ కార్యకర్తకు తోడుగా, భరోసాగా నిలవాలని అన్నారు. ఇక నుంచి ఉత్తరాంధ్రలోని ఎచ్చెర్ల నియోజకవర్గం నుండే రాజకీయ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. సమాజంలో ఒంటరిగా ఎదుర్కొనలేని కొన్ని సమస్యలను జట్టుగా సాధించవచ్చని, సభ్యత్వ నమోదు ద్వారా సంఖ్యా బలం పెరిగి సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని అన్నారు. ఎటువంటి పదవులు లేకుండానే పద్నాలుగేళ్లుగా వ్యవస్థలతో పోరాడిన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఈరోజు ప్రజలు ఇచ్చిన పదవులు, బాధ్యతలను జవాబుదారీతనంతో పని చేసి చూపిస్తున్నారని చెప్పారు. జనసేన కోసం పని చేసే కార్యకర్తలను నాయకులు గుర్తించలేకపోయినా, కొంచం ఆలస్యమైనా పవన్ తప్పనిసరిగా గుర్తిస్తారని అన్నారు. భవిష్యత్తులో స్థానిక, మున్సిపల్, కార్పొరేషన్, సాధారణ ఎన్నికల్లో బలంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని స్పష్టం చేశారు.






