‘మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది’.. పవన్ ఫొటోతో నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |

జనసేన పార్టీ(Janasena Party) కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది’.. పవన్ ఫొటోతో నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ(Janasena Party) కీలక నేత, ఎమ్మెల్సీ నాగబాబు(Nagababu) సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)తో దిగిన ఫొటోను నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘సేనాని.. సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది.. మీరు చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది.. జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది.. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది.. ఆడ బిడ్డలు, అక్క చెల్లెళ్ళకు రక్షణ తోడైంది.. అయిదున్నర కోట్ల ఆంధ్రుల కల నిజమైంది’ అని క్యాప్షన్‌గా పేర్కొన్నారు.

కాగా, ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ హోటల్‌లో పవన్ కల్యాణ్, నాగబాబు బస చేశారు. ఈ సందర్భంగా అదే రోజు ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడపై ఇరువురూ చర్చించారు. ఇది జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ క్రమంలోనే నాగబాబు సోషల్ మీడిలో అనుభవాన్ని పంచుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది. 175 స్థానాలకు 164కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన జగన్‌కు భారీ షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 135 స్థానాలు గెలవగా, జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. అంతేకాదు.. పోటీచేసిన అన్ని స్థానాల్లో, జయభేరి మోగించిన పార్టీగా రికార్డ్‌ సృష్టించింది. వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది.

Next Story