Vijayawada:క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న నాగ చైతన్య

by Jakkula.Mamatha |

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) నటించిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’ మూవీ(Tandel Movie) ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

Vijayawada:క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న నాగ చైతన్య
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) నటించిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’ మూవీ(Tandel Movie) ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అన్ని చోట్ల మంచి టాక్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంటోంది.

ఇక చైతు అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇక సినిమా పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘తండేల్’ సినిమా విజయం అందుకోవడంతో హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి ఇవాళ(ఆదివారం) విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో వీరికి అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనాలిచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం థియేటర్లలో నాగచైతన్య– చందూ మొండేటి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘తండేల్’ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

Next Story