నేడు సాయంత్రం నాదెండ్ల అంత్యక్రియలు

by velandi.Saikiran |

పంజాగుట్టలో సాయంత్రం 4 గంటలకు నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నేడు సాయంత్రం నాదెండ్ల అంత్యక్రియలు
X

దిశ‌, వెడ్ డెస్క్: నేడు సాయంత్రం నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు జ‌రుగ‌నున్నాయి. పంజాగుట్టలో సాయంత్రం 4 గంటలకు నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నిన్న మధ్యాహ్నం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాదెండ్ల మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న నాదెండ్ల భాస్కర్ రావు, ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు.

నాదెండ్ల భాస్కర్ రావు రాజ‌కీయ ప్ర‌స్థానం

రాజకీయాల్లోకి రాకముందు ఏపీ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా కొనసాగిన నాదెండ్ల భాస్కర్ రావు, 1978లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు కూడా అనుభవించారు. ఇటు ఎన్టీఆర్ హయాంలో కూడా ఆర్థిక మంత్రిగా నాదెండ్ల భాస్కరరావు పనిచేశారు. అయితే గుండెకు సంబంధించిన సర్జరీ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్తూ నాదెండ్ల భాస్కర్ రావుకు అనధికారికంగా పాలన బాధ్యతలు అప్పగించారు.

ఆ సమయంలో నాదెండ్ల వ్యవహారం నచ్చని ఎన్టీఆర్.. అతన్ని మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ క్రమంలోని తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మొదలైంది. అయితే కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యేలను కలుపుకొని ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. కానీ అప్పటి గవర్నర్ ఇచ్చిన నెల రోజుల గడువు లోపల అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక, పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు నాదెండ్ల.

Next Story