Pawan Kalyan: నా హృదయం కకావికలం అయింది..: పవన్​కల్యాణ్​ ఆవేదన

by Thanuru Gopichand |

‘చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం?

Pawan Kalyan: నా హృదయం కకావికలం అయింది..: పవన్​కల్యాణ్​ ఆవేదన
X

చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం?

నా హృదయం కకావికలం అయింది..

డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్​తీవ్ర ఆవేదన

నిందితులకు శిక్ష పడే బాధ్యత తీసుకుంటాం..

దిశ, డైనమిక్​ బ్యూరో : ‘చిన్నారులపై అఘాయిత్యాలు (Atrocities) ఇంకా ఎంతకాలం? యావత్ సమాజం తలదించుకునే ఆకృత్యానికి పాల్పడిన అటువంటి నరరూప మృగాళ్ళను కఠినంగా శిక్షించాలి...’ అని ఉప ముఖ్యమంత్రి పవన్​కల్యాణ్​ ట్విట్టర్​లో ఒక పోస్టు చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. నాలుగు రోజుల క్రితం వైఎస్సార్​ కడప జిల్లా, మైలవరం మండలం, కంబాలదిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారా నికి ఒడికట్టి, హత్య చెయ్యడం, అది కూడా బందువులకు సంబంధించిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడటం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటనగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త నా హృదయాన్ని కకావికాలం చేసిం దన్నారు. సమాజంగా మన ఎక్కడ వైఫల్యం చెందాం అనే ప్రశ్న ఈ రోజు మన ముందు ఉందని ఆయన ఆవేదన చెందారు. ఘటన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నానని ఆయన పేర్కొన్నారు.

గతంలో కథువాలో ఆసిఫా అనే చిన్నారిపై దారుణమైన అఘాయిత్యానికి పాల్పడి చంపేసినప్పుడు రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదు అని కోరుకున్నానని ఆయన తెలిపారు. అయినా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే నిందితుల్లో చట్టం నుండి తప్పించుకోవచ్చు అనే భావన కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన కిరాతకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి పోస్కో కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే భయం పుట్టేలా చూడాలని న్యాయ శాఖ, పోలీస్ శాఖను (AP Police100) , డీజీపీని (DGP), హోంశాఖ మంత్రి అనితను (Anitha) కోరుతున్నట్లు ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన తెలియజేశారు.

https://x.com/APDeputyCMO/status/1927613415087866223?t=yXbuls3-p9MM6IGYhnUKDA&s=19

Next Story