‘మా నాన్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి’.. ముద్రగడ ఆరోగ్యం పై క్రాంతి ఆరా

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-21 05:07:02  IST  )

కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే.

‘మా నాన్న హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి’.. ముద్రగడ ఆరోగ్యం పై క్రాంతి ఆరా
X

దిశ,వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత, వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. నిన్న(ఆదివారం) మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభంను కుమారై క్రాంతి పరామర్శించారు. తండ్రి ముద్రగడను కలిసిన తర్వాత ఐసియు నుంచి బయటకు వచ్చిన ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. మా నాన్నకు సరైన వైద్యం అందడం లేదు. ఆయనకు ఏమి వైద్యం చేస్తున్నారో ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. రహస్యం గా వైద్యం చేయాల్సిన అవసరం ఏముంది అని క్రాంతి నిలదీశారు. హెల్త్ బులిటెన్ ఎందుకు విడుదల చేయడం లేదు.

ఆయనకు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించకుండా డయాలసిస్ చేస్తే ఉపయోగం ఏంటి? అన్నారు. నేను అయన ఆరోగ్య పరిస్థితిని రెండు నెలల క్రితమే చెప్పానని క్రాంతి గుర్తు చేశారు. నేను వెళ్ళినప్పుడు మా నాన్న నా చేయి పట్టుకున్నారని తెలిపారు. కొందరు ఆయన నాతో మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో మూడు హాస్పిటల్స్ తిప్పారు. హైదరాబాద్ ఎందుకు తీసుకుని వెళ్లడం లేదు. కావాలని ఆసుపత్రి సెక్యూరిటీతో నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆమె మండిపడ్డారు. నాన్న ముద్రగడ పద్మనాభంకు మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. ఈ క్రమంలో డాక్టర్లు ఆయన ఆరోగ్యం గురించి హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని ముద్రగడ కుమారై క్రాంతి పేర్కొన్నారు.

Next Story