నా ఫ్యామిలీని టార్గెట్ చేసి కేసులు పెట్టారు.. మాజీ సీజేఐ జస్టిస్ NV రమణ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

గత ప్రభుత్వ హయాంలో తమ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా ఫ్యామిలీని టార్గెట్ చేసి కేసులు పెట్టారు.. మాజీ సీజేఐ జస్టిస్ NV రమణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో తమ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని కేసులు పెట్టారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వీఐటీ (VIT) యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టం, త్యాగంపై అమరావతి నగరం నిర్మింపబడుతోందని కామెంట్ చేశారు. స్వాతంత్ర్యం తర్వాత అతి సుదీర్ఘంగా రాజధాని అమరావతి కోసం ఇక్కడి రైతులు పోరాటం చేశారని గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థపై రైతులు నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చివరకు తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story