- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కారును ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు.. జనసేన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు అడ్డగోలుగా ఎలాగైన పైసా వెనకేసేందుకు అడ్డదారులు తొక్కుతుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు అడ్డగోలుగా ఎలాగైన పైసా వెనకేసేందుకు అడ్డదారులు తొక్కుతుంటారు. ఎమ్మెల్యే, ఎంపీనో అయితే ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటూ అందినకాడికి దోచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఏపీలో ఓ ఎమ్మెల్యే పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. రాజానగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. ఒకప్పుడు గొప్పగా బతికిన తమ కుటుంబం ఇప్పుడు పేదరికం మగ్గుతోందని అన్నారు. రాజకీయాల కారణంగా అప్పులపాలైపోయానని కామెంట్ చేశారు. తన కారును కూడా ఫైనాన్స్ వాళ్లు కిస్తీ కట్టలేదని తీసుకెళ్లిపోయారని తెలిపారు. ప్రస్తతం అల్లుడి కారును వాడుతున్నానని పేర్కొన్నారు. అయినా.. నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని, నియోజకవర్గ ప్రజల కోసం తీను ఏం చేసేందుకైనా సిద్ధమని బత్తుల బలరామకృష్ణ చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విన్న జనసేన కార్యకర్తలు తమ ఎమ్మెల్యే ఇంతా కష్టాల్లో ఉన్నాడా అని నెవ్వరపోయారు.






