- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhanda-2: టాలీవుడ్ హీరోలపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటీనటులపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్(Tollywood) నటీనటులపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్(Music Director Thaman) సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో యూనిటీ లేదని, ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘అఖండ-2’ సినిమా సక్సెస్ మీట్‌లో థమన్ మాట్లాడుతూ టాలీవుడ్‌కి దిష్టి తగిలిందన్నారు. ఎవరికైనా దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయాలని, కానీ బ్యాండ్ వేయొద్దని చెప్పారు. టాలీవుడ్‌లో ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారని తెలిపారు. సొంత సినిమాలను ఎవరూ వాయిదా వేసుకోరని చెప్పారు. కష్టం ఎవరికి వచ్చినా సాయం అవసరం అవుతుందని గుర్తు చేశారు. టాలీవుడ్‌లో పని చేసే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని, ప్రస్తుతం ఆ సమయం వచ్చిందని థమన్ పేర్కొన్నారు.
Next Story






