- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. సిట్ ఎదుట లొంగిపోయిన అవినాష్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట లొంగిపోయాడు. సుప్రీంకోర్టులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ మంగళవారం (ఫిబ్రవరి 24) అవ్వడంతో విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి తన లాయర్ తో కలిసి వెళ్లి.. అధికారుల ఎదుట సరెండర్ అయినట్లు తెలుస్తోంది. గతంలో హైకోర్టులో కూడా ముప్పిడి అవినాష్ కు బెయిల్ రిజెక్ట్ అయింది. జనవరి 29న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చిల నేతృత్వంలో ఉన్న ధర్మాసనం అవినాష్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే వాదనలు విన్నారు.
విదేశాలకు వెళ్లిన వివరాలపై ఆదా తీసిన సీజేఐ సూర్యకాంత్.. ఏడాదికాలంగా అతను పరారీలోనే ఉన్నాడు కదా? అని ప్రశ్నించారు. ఏ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లాడు? అని అడిగారు. చట్టాన్ని ఏమార్చేందుకు ప్రయత్నించే ఇలాంటివారికి ముందస్తు బెయిల్ ఇచ్చి ఎందుకు రక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ ఇచ్చేందుకు సీజేఐ నిరాకరించారు. ఫిబ్రవరి 26న అవినాష్ శ్రీలంక నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎల్ఓసీని ఆపాలని న్యాయవాది కోరగా దానికి కూడా నిరాకరించారు. ముందు అతను లొంగిపోవాలని, ఆ తర్వాతే రెగ్యులర్ లేదా మధ్యంతర బెయిల్ పిటిషన్లను పరిశీలిస్తామని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను మార్చి 12కు వాయిదా వేశారు. లిక్కర్ స్కామ్ కేసు నమోదైన తర్వాత ముప్పిడి అవినాష్ రెడ్డి సోదరుడు అరెస్టయ్యాక అతన్ని కూడా నిందితుడిగా చేరుస్తారని భయపడి విదేశాలకు పారిపోయాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడిని లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో.. మరో దారిలేక సిట్ ఆఫీసులో సరెండర్ అయ్యాడు.






