- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ కార్మికుల రణభేరి.. రేపు స్తంభించనున్న రాష్ట్రం
by Vemula.Srinu Prasad |
మున్సిపల్ కార్మికులు మంగళవారం రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. గత నెల నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ కార్మికులు మంగళవారం రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. గత నెల నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 48 వేల మంది కార్మికులు ఈ నిరసనలో పాల్గొననున్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.
సమ్మె కారణంగా ..
ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులు స్తంభించిపోయే అవకాశం ఉంది. చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణ వంటి సేవలకు ఆటంకం కలగనుంది. ప్రభుత్వం చర్చలకు రావాలని, ప్రతినెలా నిర్ణీత సమయంలోనే జీతాలు చెల్లించేలా శాశ్వత పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు విధులకు దూరంగా ఉండాలని కార్మికులు నిర్ణయించుకున్నారు.
Next Story






