- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. మరో ఏడుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు
మొలకలచెరువు (Molakalacheruvu)లో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మొలకలచెరువు (Molakalacheruvu)లో నకిలీ మద్యం తయారీ కేసులో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే మొత్తం 14 మందిపై కేసు నమోదు చేయగా.. 12 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మద్యం తయారీకి షెడ్డు లీజుకు తీసుకున్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు (Kodali Srinivasa Rao)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేసులో తాజాగా తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇంచార్జి జయచంద్రా రెడ్డి (Jayachandra Reddy), అతని బావమరిది గిరిధర్ రెడ్డి (Giridhar Reddy) పేర్లను చేర్చారు. మిగిలిన ఐదుగురి పేర్లను మాత్రం ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచారు. కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విదేశాల్లో ఉండటంతో అతడిని మరో రెండు రోజుల్లో అదుపులోకి తీసుకోనున్నట్లుగా ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.






