- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముద్రగడకు అనారోగ్యం.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన కుమారుడు గిరిబాబు
వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ

- ఆస్పత్రిలో ముద్రగడ పద్మనాభం
- తండ్రి ఆరోగ్యంపై ముద్రగడ కుమారుడు కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమారుడు గిరిబాబు (GIRIBABU) కీలక ప్రకటన చేశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు గిరిబాబు. ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో అలాగే పలు మీడియాలో ముద్రగడ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాన్ని నమ్మకూడదని కూడా ఈ సందర్భంగా కోరారు గిరిబాబు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని తెలిపారు.
ఇది ఇలా ఉండగా... ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని... ఆయనను ఏపీ నుంచి హైదరాబాద్ తరలించారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకువెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. రోడ్డు మార్గంలో అంబులెన్స్ లోనే ముద్రగడ పద్మనాభంను హైదరాబాద్ తరలించినట్లు తెలుగు మీడియాలలో కథనాలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన కుమారుడు గిరిబాబు... ముద్రగడ హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు.






