- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు
by Gantepaka Srikanth |
కాపు(Kapu) ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాపు(Kapu) ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులకు హైదరాబాద్‌కు తరలించారు. కాగా, గత కొంతకాలంగా క్యాన్సర్(Cancer)తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం శనివారం మారింత క్షీణించడంతో ఆయన్ని కాకినాడ నుంచి హుటాహుటిన మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్య ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్నారు. గతంలో కాపు రిజర్వేషన్ కోసం గట్టిగా పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. గతంలో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా కూడా పని చేశారు. శాసనసభ్యుడిగా కూడా పలుమార్లు గెలుపొందారు.
Next Story






