- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీడియాకు ముద్రగడ కుమారుల బహిరంగ లేఖ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన కుమారులు బాలు, గిరిబాబు మీడియాకు బహిరంగ లేఖ విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన కుమారులు బాలు, గిరిబాబు మీడియాకు బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ తండ్రి ముద్రగడ పద్మనాభం నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఆఖరి కోరిక మేరకే ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించినట్టు స్పష్టం చేశారు. తమ కుటుంబానికి, బూర్లపూడి క్రాంతి కుటుంబానికి గత కొన్నేళ్లుగా ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు.
అంతేకాకుండా బూర్లపూడి క్రాంతి కడచూపుకు రాకూడదని కూడా తండ్రి తీసుకున్న నిర్ణయమే అని వెల్లడించారు. ముద్రగడ వ్యక్తిత్వం, ఆత్మాభిమాన్ని ప్రతిబింబించేలా ఆయన చివరి కోరికలను గౌరవించి అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు అండగా నిలిచి, ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన మాజీ సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు ప్రసారం చేయవద్దని మీడియాను విజ్ఞప్తి చేశారు.






