ఆందోళనకరంగా ముద్రగడ ఆరోగ్యం.. హైదరాబాద్‌కు ఎయిర్‌ లిఫ్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-21 03:17:32  IST  )

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్‌ నాయకులు ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) శనివారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

ఆందోళనకరంగా ముద్రగడ ఆరోగ్యం.. హైదరాబాద్‌కు ఎయిర్‌ లిఫ్ట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్‌ నాయకులు ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) శనివారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాకినాడ (Kakinada)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను తొలుత నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సామర్లకోట ఏడీబీ రోడ్డులోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డయాలసిస్‌ చేయగా ఆయన ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం కోసం హైదాబాద్‌ (Hyderabad)లోని యశోదా ఆసుపత్రికి తరలించారని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు రోడ్డు మార్గంలో కాకినాడలోని మెడికవర్ ఆసుపత్రి నుంచి తొలుత రాజమండ్రి తరలించనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ౠకు ఎయిర్‌ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Next Story