కష్టకాలంలో కొండంత అండ.. గిరిబాబు భావోద్వేగం

by Vemula.Srinu Prasad |

కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చూపిన ఆత్మీయత, మద్దతు ఎప్పటికీ మరచిపోలేమని ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు భావోద్వేగానికి లోనయ్యారు....

కష్టకాలంలో కొండంత అండ.. గిరిబాబు భావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం కుటుంబానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చూపిన ఆత్మీయత, మద్దతు ఎప్పటికీ మరచిపోలేమని ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం పట్ల జగన్ చూపిన ప్రేమాభిమానాలు వర్ణనాతీతమని, తమ కుటుంబంలో గౌరవం నిరంతరం పెరుగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి, ఆయన్ను ఎలాగైనా ప్రాణాలతో కాపాడుకోవాలని జగన్ తీవ్రంగా ప్రయత్నించారని గిరిబాబు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో జగన్ నిరంతరం తనకు ఫోన్ చేస్తూ, తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ ధైర్యాన్ని నింపారని గిరిబాబు చెప్పారు.

కష్టకాలంలో అండగా నిలిచి తమ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారని గిరిబాబు తెలిపారు. తమ తండ్రి చివరి ప్రయాణంలో వైఎస్ జగన్ స్వయంగా వచ్చి పాడె మోయడం తమ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఘట్టమని గిరిబాబు వ్యాఖ్యానించారు. ఒక నాయకుడిగా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా నిలబడి చివరి వరకు తోడుగా ఉన్నారని జగన్ కు ముద్రగడ గిరిబాబు గిరిబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story