‘ఓసారి ఇంటికి తీసుకెళ్లండి’.. వైద్యులను కోరిన ముద్రగడ

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-21 07:20:59  IST  )

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

‘ఓసారి ఇంటికి తీసుకెళ్లండి’.. వైద్యులను కోరిన ముద్రగడ
X

దిశ,వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అనారోగ్య కారాణలతో కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. సామర్లకోట ఏడీబీ రోడ్డులోని ఓ ఆసుపత్రిలో వైద్యులు వెంటనే ట్రీట్మెంట్ అందించారు. డయాలసిస్‌ చేయడంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఈ క్రమంలో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో తాజాగా అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడికి తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం తనను కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులను కోరారు. దీంతో అక్కడకు తీసుకురాగా, పరామర్శించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మెరుగైన వైద్యం కోసం ముద్రగడను హైదరాబాద్‌కు తరలించనున్నారు.

Next Story