- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడపకు రేణిగుంట ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఇవ్వండి: కేంద్రమంత్రిని కోరిన ఎంపీ అవినాశ్ రెడ్డి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కలిశారు...

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్(Union Railway Minister Ashwani Vaishnav)ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి(MP YS Avinash Reddy) కలిశారు. మైసూరు - రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్(Mysore - Renigunta Weekly Express)ను కడప(Kadapa) వరకూ పొడిగించాలని ఆయన కోరారు. మచిలీపట్నం–ధర్మవరం ఎక్స్‌ప్రెస్(Machilipatnam-Dharmavaram Express)కు ముద్దనూరు(Muddanur)లో స్టాపింగ్ కల్పించాలని అశ్వినీ వైష్ణవ్‌కు అవినాశ్ రెడ్డి వినపత్రం అందజేశారు.
ఎన్నో రోజులుగా ప్రజల నుంచి ఈ రెండు రైళ్ల డిమాండ్ వినిపిస్తున్నాయి. కడప నుంచి డైరెక్ట్‌గా మైసూర్, మచిలీపట్నం వెళ్లేందుకు రైళ్లు లేవు. దీంతో ఈ రూట్‌లో కడప జిల్లా ప్రజలు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప ఎంపీకి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని కడప వాసులకు ఎంపీ అవినాశ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రజల ప్రజల డిమాండ్లు, అవసరాలను ఎంపీ అశినాశ్ రెడ్డి వినతి పత్రంలో రూపంలో అందజేశారు. ఇందుకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.






