- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురంధేశ్వరి శకుని..ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఆమె నేర్పరి: విజయసాయిరెడ్డి
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పురంధేశ్వరి ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి అని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.‘తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీతో అంటకాగి చంద్రబాబు గెంటేసేసరికి అదే తండ్రిని అవమానించిన కాంగ్రెస్ లో చేరి నిస్సిగ్గుగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన నీతిలేని చరిత్ర పురంధరేశ్వరిది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవమానవీయంగా విభజన చేసిన కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా తనవంతు శకుని పాత్ర పోషించి రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ ఈ పురంధరేశ్వరి అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు.






