- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్.. త్వరలో...!
సీఎం చంద్రబాబుపై పరువు నష్టం వేస్తానని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ సీపోర్టు(Kakinada Seaport)లో రూ. 3600 కోట్ల విలువైన వాటాలను యజమానిగా ఉన్న తన నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy), మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(MP YV Subbareddy) తనయుడు, వైసీపీ నేత విక్రాంత్ రెడ్డి(YCP leader Vikrant Reddy) బలవంతంగా బెదిరించి లాక్కున్నారని సీఐడీ(CID) అధికారులకు కె. వెంకటేశ్వరావు(కేవీఆర్) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే కేవీఆర్ చేసిన ఫిర్యాదుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేవీరావుకు అన్యాయం జరిగితే నాలుగేళ్లుగా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అప్పుడే కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని నిలదీశారు. కేవీరావును విక్రాంతి రెడ్డి బెదిరించారని ఆధారాలుంటే చూపించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
కేవీరావు బ్రోకర్ పనులు చేస్తారని, ఆయన్ను విక్రాంత్ రెడ్డి బెదిరించారంటే నమ్మొచ్చా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు కేవీరావు బినామీ అని, అందుకే కాకినాడ పోర్టు కట్టబెట్టారని ఆరోపించారు. కేవీరావు దొడ్డిదారిన కాకినాడ పోర్టుకు సీఎండీ అయ్యారని వ్యాఖ్యానించారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు చేయాలన్నారు. సీఐడీతోనే కాదని, సీబీఐ(Cbi)తోనూ విచారించాలని చెప్పారు. తనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రోజుకో సమస్య తెచ్చి దానిమీదే కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.






