- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభలో అన్నీ బయటపెడతాం : జగన్ దురాగతాలపై ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు
by Naga Rani Yarlagadda |
ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) పై లోక్ సభలో చర్చిస్తామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Srikrishna Devarayalu) తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) పై లోక్ సభలో చర్చిస్తామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (MP Lavu Srikrishna Devarayalu) తెలిపారు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఈ వ్యాఖ్యలు చేశారు. దీనితోపాటు పార్లమెంట్లో రైతుల సమస్యలు, పంట గిట్టుబాటు ధరలపై కూడా చర్చిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడించారు. వైసీపీ (YCP) హయాంలో జగన్ చేసిన దురాగతాలను బట్టబయలు చేస్తామని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో విచారణ వేగంగా జరుగుతోందని, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy)ని సిట్ (SIT) విచారిస్తోందని తెలిపారు.
Next Story






