- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సైకిల్ పై బయలుదేరిన ఎంపీ
ఏపీలో మరికాసేపట్లో రాజధాని అమరాతి పనుల పునఃప్రారంభం కానున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మరికాసేపట్లో రాజధాని అమరాతి పనుల పునఃప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అమరావతికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సైకిల్ పై బయలు దేరారు. దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని వెలగపూడి సభకు వెళ్తున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాజధాని అమరావతి ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో రాష్ట్రం ముందుండబోతుంది. అమరావతి రైతుల ఆకాంక్షలు నెరవేరబోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో శాశ్వత రాజధానిగా మారబోతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2024 లో కూటమి ప్రభుత్వం రాకతో చీకట్లు పోయి వెలుగులు వచ్చాయన్నారు. నమ్మి ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది. ఇప్పటివరకు రాజధాని లేని మనకు ప్రపంచ స్థాయి నగరం సిద్ధం అవుతోందన్నారు. ఇక మీద ఆంధ్రులు గర్వంగా, సగర్వంగా గుండెల మీద చేయి వేసుకుని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చిందని ఎంపీ కలిశెట్టి తెలిపారు.






