పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీపై RRR హర్షం

by GSrikanth |

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల భేటీని వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వాగతించారు.

పవన్ కల్యాణ్-చంద్రబాబు భేటీపై RRR హర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల భేటీని వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్వాగతించారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపడం శుభపరిణామం అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ఫాసిస్ట్ జీవోలపై సమిష్టి పోరాటం అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. రాబోయే విజయదశమిలోగా ప్రజలు సరైన తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. దుష్టశిక్షణ తథ్యం అని అన్నారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

Next Story