- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కలిశారు.

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా వర్జీనియా పొగాకు, పామాయిల్ రైతుల సమస్యలను పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్న పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పుట్టా మహేశ్ కుమార్ మాట్లాడుతూ.. పొగాకు రైతులకు సీలింగ్ లిమిట్ తీసివేయాలని కోరినట్టు తెలిపారు. సీలింగ్ లిమిట్ లో తక్కువ మొత్తంలో పెనాల్టీ వేసే విధంగా పీయూష్ గోయల్ ఒప్పుకున్నారని అన్నారు. పామాయిల్ రైతులకు గిట్టుబాట ధర కల్పించే విషయంలోనూ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. గత నెల కంటే ఈ నెల వెయ్యి నుండి పదిహేను వందలు పెరిగిందన్నారు. రాబోయే కాలంలో పామాయిల్ ధరలు మరింత పెరుగుతాయని చెప్పారు.
Next Story






