ఏపీ రాజధానిపై లోక్‌సభలో ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీ పునర్ వ్యవస్థీకరణతర్వాత రాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందన్నారు...

ఏపీ రాజధానిపై లోక్‌సభలో ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Amaravati) చట్టబద్ధత బిల్లును లోక్ సభ(Loksabha)లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ(AP Reorganization)తర్వాత రాష్ట్రానికి కొత్త రాజధాని అవసరం ఏర్పడిందన్నారు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై సరైన చర్చ జరగకపోయినా రాష్ట్ర ప్రజలు అంగీకరించారన్నారు. అమరావతికి భూమి ఇచ్చేందుకు 29 వేల మంది రైతులు ముందుకొచ్చారని పేర్కొన్నారు. ఈ కారణంగానే అమరావతి మొదటి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఆ సమయంలో ప్రధాని మోడీ సైతం శంకుస్థాపన చేశారని పురంధేశ్వరి చెప్పారు. వైఎస్ జగన్ హయాంలో అమరావతిపై తీవ్ర అస్థిరతను తీసుకొచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే రాజధానిపై తన నిర్ణయాన్ని మార్చుకుందని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story