- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేనా..?.. అలాంటి పని పొరపాటున కూడా చేయను: పిల్లి సుభాష్ చంద్రబోస్
వైసీపీకి విజయసాయి రాజీనామా చేయడంపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి(Mp Vijayasai Reddy) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామాపై తాజాగా మరోఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్(Mp Pilli Subhash Chandrabose) స్పందించారు. వైసీపీని విజయసాయిరెడ్డి వీడటం బాధాకరమన్నారు. పార్టీలోనూ, పార్లమెంట్‌లోనూ ఆయన వెన్నెముకగా పని చేశారని తెలిపారు. మరి ఏ పరిస్థితుల్లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో తనకు తెలియదని సుభాష్ చంద్రబోస్ చెప్పారు.
విజయసాయిరెడ్డి పార్టీలో అందరికీ మార్గదర్శకమని, పార్టీలో నిత్యం పని చేసేవారని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.ఏది ఏమైనా పార్టీలో ఆయన లేని లోటు తీరనిది అని చెప్పారు.అధికారం పోవడంతో పార్టీ నుంచి వెళ్లిపోవడాలు సహజమేనని, కానీ ఆ లిస్టులో విజయసాయిని చూడలేమననారు. పొరపాటున కూడా తాను వైసీపీకి రాజీనామా చేయననని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.






