- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖాకీల అండతోనే దాడులు: ఎంపీ మిథున్ రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేత దశరథరామిరెడ్డిపై దాడి జరగడం అత్యంత హేయమని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేత దశరథరామిరెడ్డి(YSRCP leader Dasharatharami Reddy)పై దాడి జరగడం అత్యంత హేయమని ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. నిన్ననే బాధితుడు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించారని, ఆరోజే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటిలో వైసీపీ నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పి.దశరథరామిరెడ్డిపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసులు వారికి కొమ్ముకాస్తున్నారని, చట్టాన్ని కాపాడాల్సిన వారే ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటని ఎంపీ మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు.
అరెస్ట్ ఎందుకు చేయలేదు..
దశరథరామిరెడ్డిపై దాడికి పాల్పడిన నిందితులను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని మిథున్ రెడ్డి నిలదీశారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే యంత్రాంగం పనిచేస్తోందని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు పక్షపాత వైఖరి వీడాలని, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.






