కోర్టు ప్రాంగణంలో ఎంపీ మిథున్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్

by Vemula.Srinu Prasad |

లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కోర్టు ప్రాంగణంలో ఎంపీ మిథున్ రెడ్డి వేచి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

కోర్టు ప్రాంగణంలో ఎంపీ మిథున్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకల కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి(Rajampet MP Mithun Reddy)ని సిట్ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)కు తరలించింది. అయితే అంతకుముందు మిథున్ రెడ్డి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో ఆయన కోర్టు ప్రాంగణంలో కూర్చుని తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఆయన కోర్టు వద్ద కూర్చున్న ఫొటో బయటకు వచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది.

గతంలో అక్రమ ఆస్తుల కేసు(Illegal Assets Case)లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) కూడా జైలు(Jail)కు వెళ్లారు. ఆ సమయంలోనూ ఇలాంటి ఫొటోలు బయటకు వచ్చాయి. 2024 ఎన్నిలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP chief Chandrababu Naidu) అరెస్ట్ సమయంలోనూ పోలీస్ స్టేషన్, కోర్టు, జైలు వద్ద తీసిన ఆయన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా మిథున్ రెడ్డి ఫొటోలు సైతం ఇలానే వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. అక్రమంగా చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఏమైందని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే.. కక్ష సాధింపుల్లో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ చేసి జైలుకు పంపారని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. ఇలా ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు వద్ద కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Next Story