MP Mithunredy: మళ్లీ పిటిషన్.. ఈసారైనా ఓకే అవుతుందా.?

by Vemula.Srinu Prasad |

విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు...

MP Mithunredy: మళ్లీ పిటిషన్.. ఈసారైనా ఓకే అవుతుందా.?
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీలో లిక్కర్ కేసు(Liquor Case) ఎంత సంచలనం సృష్టించిందో అందిరికీ తెలిసిందే. అయితే ఈ కేసు నిందితులకు కూడా బెయిల్(Bail) విషయంలోనూ అంతే ఉత్కంఠగా మారింది. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకూ సిట్ అధికారులు 12 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రముఖంగా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, జైలు మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో ఆయన ఉన్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ పలుమార్లు పిటిషన్ దాఖలు చేసినా కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి నిరాశే ఎదురైంది.

దీంతో తాజాగా మరోసారి కూడా విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి దాఖలు చేయాల్సిన పిటిషన్ పై కోర్టు విచారించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మిథున్ రెడ్డి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సారైనా మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ వస్తుందేమో చూడాలి.

Next Story