మేం ఎప్పుడూ జోక్యం చేసుకోం: ఎంపీ లావు సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

విదేశీ అంతర్గత విషయాలపై తాము ఎప్పుడూ జోక్యం చేసుకోమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు..

మేం ఎప్పుడూ జోక్యం చేసుకోం: ఎంపీ లావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: విదేశీ అంతర్గత విషయాలపై తాము ఎప్పుడూ జోక్యం చేసుకోమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు(MP Lavu Srikrishna Devarayulu) తెలిపారు. ఉగ్రవాదం(Terrorism)పై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు పెంచి పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అలాంటి దేశాలను ఉగ్రవాద సంస్థలను తాము వేర్వేరుగా చూడమని చెప్పారు. తీవ్రవాదం విషయంలో పాకిస్థాన్ వైఖరి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)తో పాకిస్తాన్(Pakistan), భారత(Bharat) సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. ఉగ్రవాదుల దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్థాన్ వైఖరిని తెలియజేసేందుకు నాలుగుదేశాల్లో పర్యటించామని చెప్పారు. ఆయా దేశాధినేతలు, విపక్ష నాయకులు, అక్కడి మీడియాకు వివరించామని ఎంపీ లావు పేర్కొన్నారు.

Next Story