- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తొత్తుకు అరుపులెక్కువ.. పని తక్కువ: కేశినేని చిన్ని సెటైర్లు
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి కల్యాణోత్సవంలో ప్రోటోకాల్ వివాదంపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(Ntr District) గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం(Nemali Venugopalaswamy Kalyanostavam)లో ప్రోటోకాల్ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని(Mp Kesineni Chinni)కి పురోహితులు అందజేసిన పట్టువస్త్రాలను తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు(Tiruvuru Kolikipudi Srinivasarao) లాక్కొని తన తలపై పెట్టుకోవడంపై తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొలికిపూడి ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కొలికిపూడిని అవమానించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని స్పందిస్తూ ‘‘నెమలి గుడిలో జరిగింది దురదృష్టకర ఘటన. దేవుడి దగ్గర రాజకీయాలు చేయకూడదు. భక్తి చూపించాలి. చిన్న సంఘటన జరిగింది. పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. నాకు ఇబ్బంది జరిగితే దేవుడే చూసుకుంటారు.’’ అని చెప్పారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది...
‘‘వైసీపీ ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో దళిత డాక్టర్‌ను ఏం చేశారో అందిరికీ తెలుసు. మరో దళితుడి చంపి డోర్ డెలివరీ చేశారు. దళితులపై మాట్లాడే హక్కు వైసీపీ లేదు. జగన్ తొత్తులకు ఏం పని ఉండదు. విజయవాడలో జగన్‌కు ఓ తొత్తు ఉన్నాడు. అరుపులు ఎక్కువ, పని తక్కువ. తండ్రుల దగ్గర నుంచి రక్త చరిత్ర అలవాటు. ఆ రక్త ముద్దలు తింటున్నారు.అలాంటి తొత్తులు గురించి మాట్లాడే హీన స్థితిలో లేను. ఇప్పటివరకూ కార్పొరేటర్ కూడా గెలవలేదు. ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు..?. మా కార్పొరేటర్లు, డివిజన్ నాయకుల స్థాయికి కూడా పనికి రారు.’’ అని కేశినేని చిన్ని విమర్శించారు.






