- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు ముద్దు.. మూడోవారు వద్దు: పొత్తులపై ఎంపీ GVL కీలక వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతోనే బీజేపీ పొత్తు అని.. ఇద్దరు ముద్దు.. మూడోవారు వద్దనేదే మా విధానం అని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. బీజేపీ, జనసేన పొత్తుపై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ఇక రాజధాని అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి విషయంలో బీజేపీ మొదటి నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని.. అంతేకానీ సీఎం వచ్చినంతా మాత్రాన అదే రాజధాని అంటే కుదరని అన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేస్తోన్న పాదయాత్రకు అనుకున్నంతా మైలేజ్ రాలేదని అభిప్రాయపడ్డారు. కేవలం టీడీపీ వర్గాలే ప్రచారం చేసుకుంటున్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు.
READ MORE






