- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో హైదరాబాద్‌గా విశాఖ.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మరో హైదరాబాద్‌గా విశాఖ కాబోతోందని ఎంపీ సీఎం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం, విశాఖ డేటా సెంటర్, హైదరాబాద్ అభివృద్ధిపై మాజీ సీఎం జగన్(Former Cm Jagan) చేసిన వ్యాఖ్యలకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్(Anakapalli mp Cm Ramesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పాలనలో విచ్చలవిడిగా మద్యం దోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు. డిస్టిలరీలను ఆధీనంలోకి తీసుకున్నారని, నాణ్యతలేని మద్యం సరఫరా చేశారని ఆరోపించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ప్రభుత్వ దుకాణాల పేరుతో రూ.లక్షకోట్లు దోచుకున్నారని వ్యాఖ్యానించారు. హైటెక్ సిటీ(Hightech City)పై జగన్ మాట్లాడటం విడ్డూరమన్నారు. అభివృద్ధి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, యువతకు ఉద్యోగాల కల్పనే ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) ధ్యేయమని చెప్పారు. భవిష్యత్‌లో విశాఖ(Visakha) మరో హైదరాబాద్(Hyderabad) అవుతుందని సీఎం రమేశ్ తెలిపారు.






