- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనసేనలో చేరుతున్నా.. అధికారికంగా తేదీ ప్రకటించిన ఎంపీ బాలశౌరి
తాను జనసేన పార్టీలో ఆదివారం చేరుతున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు

దిశ, వెబ్ డెస్క్: తాను జనసేన పార్టీలో ఆదివారం చేరుతున్నట్లు ఎంపీ బాలశౌరి ప్రకటించారు. ఏపీని అన్ని విధాలుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభివృద్ధి చేస్తారన్న తనకు ఉందని ఆయన తెలిపారు. తనతో పాటు చాలా మంది జనసేనలో చేరుతున్నట్లు చెప్పారు. తన పోటీపై ఇక పవన్ దే నిర్ణయమన్నారు. పవన్‌తో చర్చించాకే ఆయనతో కలిసి డిసైడైనట్లు స్పష్టం చేశారు. పోలవరం, స్టీల్ ప్లాంట్‌పై పవన్ కల్యాణ్ తో చర్చించానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో పోలవరం పనులు ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా తాను రాజకీయాల్లో వచ్చినట్లు ఎంపీ బాలశౌరి తెలిపారు. కాగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ బాలశౌరి గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వమని జగన్ సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు బాలశౌరి జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ అంశంపై వేగంగా అడుగులు వేశారు. జనసేనలో ఆదివారం చేరుతున్నట్లు బాలశౌరి అధికారికంగా వెల్లడించారు.






