చిన్న మార్పుకే సంబరాలా: అమరావతి చట్టంపై ఎంపీ అవినాశ్ రెడ్డి సెటైర్స్

by Vemula.Srinu Prasad |

ఏపీ పునర్విభజన చట్టంలో చేసిన చిన్న మార్పుకే కూటమి నాయకులు సంబురాలు చేసుకుంటున్నారా అని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు...

చిన్న మార్పుకే సంబరాలా: అమరావతి చట్టంపై ఎంపీ అవినాశ్ రెడ్డి సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పునర్విభజన చట్టంలో చేసిన చిన్న మార్పుకే కూటమి నాయకులు సంబురాలు చేసుకుంటున్నారా అని ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో పార్టీ అధినేత జగన్(Jagan)ఏర్పాటు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి(Amaravati)లో లక్ష ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.2 లక్షల కోట్లు అవుతుందని, అది సాధ్యమేనా అని నిలదీశారు. ఏపీ భవిష్యత్తుకు జగన్ ప్రాతిపాదించిన మావిగన్ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రాజధానిని చేయాలని మావిగన్ కాకుండా ఏ పేరైనా పెట్టుకోండి అని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story