ఎక్కడికి రమ్మన్నా వస్తా.. నిరూపించండి: వివేకా హత్యపై అవినాశ్ రెడ్డి సవాల్

by Vemula.Srinu Prasad |

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో పాటు ఇసుక, బేరైట్స్, అక్రమ రవాణాకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొట్టిపారేశారు..

ఎక్కడికి రమ్మన్నా వస్తా.. నిరూపించండి: వివేకా హత్యపై అవినాశ్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య(Former Minister Ys Vivekanandareddy Murder) కేసుతో పాటు ఇసుక(Sand), బేరైట్స్(Barytes) అక్రమ రవాణాకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(MP YS Avinash Reddy) కొట్టిపారేశారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు తనపై నిందలు వేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఎలాంటి పరీక్షకైనా సిద్ధం

తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించడానికి ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నానని అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎలాంటి పరీక్షకైనా వెనకాడేది లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దేవుడి సన్నిధిలో ప్రమాణానికి కట్టుబడి ఉన్నా

ఒక కేజీ ఇసుక గానీ, ఒక కేజీ బేరైట్స్ గానీ అక్రమ రవాణా చేశాననే ఆరోపణలపై దేవుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఎంపీ పునరుద్ఘాటించారు. తప్పు చేయనందున తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story