నువ్వెంత.. నీ బతుకెంత..?: బీటెక్ రవిపై ఎంపీ అవినాష్ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో గతంలో జరిగిన రాజకీయ, ప్రముఖుల హత్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో తన తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డితో పాటు పలువురు నాయకులు హత్యకు గురయ్యారంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శ, ప్రతివిమర్శలకు దారి తీసింది...

నువ్వెంత.. నీ బతుకెంత..?: బీటెక్ రవిపై ఎంపీ అవినాష్ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గతంలో జరిగిన రాజకీయ, ప్రముఖుల హత్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో తన తాత రాజారెడ్డి, బాబాయ్ వివేకానందారెడ్డితో పాటు పలువురు నాయకులు హత్యకు గురయ్యారంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శ, ప్రతివిమర్శలకు దారి తీసింది. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ నేతలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ తాత రాజారెడ్డి చేసిన ఎరాచకాలపై టీడీపీ నేత బీటెక్ రవి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అసలు రాజకీయ హత్యలకు బాట వేసిందే వైఎస్ ఫ్యామిలీ అని చెప్పారు. దీంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా స్పందించారు. బీటెక్ రవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వెంత.. నీ బతుకెంత’ అని విరుచుకుపడ్డారు.

ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు..

‘‘బీటెక్‌ రవి వాడు వీడు అనే లెవల్‌లో మాట్లాడాడు...నీ గురించి అలా మాట్లాడాలంటే మాకు ఎంత సేపు..?. నువ్వెంత..నీ బతుకెంత..?. ఇసుక, ముగ్గురాయికి కన్నం వేసి బతికేవాడివి నువ్వు.. నువ్వు జగన్‌‌ని నోటికొచ్చినట్లు మాట్లాడేవాడివా..?. నోరు జాగ్రత్తగా పెట్టుకో. మేం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లావ్‌..ఎందుకెళ్లావో ప్రజలకు చెప్పు. ఆయన ఎమ్మెల్సీ పదవి అమ్ముకోడానికి రూ.12 కోట్లు ఇప్పించండని విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆనాడు జగన్‌ అలాంటి పనులు చేయమని తిరస్కరించారు. తన ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా..మీరు ఒప్పుకుంటే వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా..?. వైఎస్సార్సీపీలో చేర్చుకోకపోతే సీఎం రమేష్‌ను పట్టుకుని బీజేపీలోకి వెళ్తానన్నది నిజం కాదా..?. ఇదీ బీటెక్‌ రవి బతుకు...ప్రజలు ఇచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతుకు అతనిది.’’ అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు.

Next Story