- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్‌ను ఓడించి తీరాలి.. MP ఒవైసీ సంచలన పిలుపు
వక్ఫ్ బోర్డు(Waqf Board) విషయంలో కేంద్రం వైఖరిపై ఎమ్ఐఎమ్(MIM) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: వక్ఫ్ బోర్డు(Waqf Board) విషయంలో కేంద్రం వైఖరిపై ఎమ్ఐఎమ్(MIM) పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టాన్ని వైసీపీ పార్టీ నిర్మోహమాటంగా వ్యతిరేకించింది. కానీ టీడీపీ, జనసేన పార్టీలు మద్దతిచ్చాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తప్పకుండా బుద్ధి చెప్పాలి. ఓడించి తీరాలని ఒవైసీ పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో అడ్డగోలుగా వక్ఫ్ చట్టం అమలు చేశారని మండిపడ్డారు. ఏపీలో ముస్లిం హక్కులను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీరి మోసపూరిత మాటలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పదే పదే చంద్రబాబు అమరావతి జపం చేస్తున్నారు. ఎందుకు పనుల్లో వేగం పెంచడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి వారికి స్థానిక ఎన్నికల నుంచి ఓటు రుచి చూపించాలని కోరారు.






