హైదరాబాద్‌కు ముద్రగడ తరలింపు.. క్రాంతి కీలక విజ్ఞప్తి

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-22 03:34:33  IST  )

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌కు ముద్రగడ తరలింపు.. క్రాంతి కీలక విజ్ఞప్తి
X

దిశ,వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి అనారోగ్య కారణాలతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ తరుణంలో సామర్లకోట ఏడీబీ రోడ్డులోని ఓ ఆసుపత్రిలో వైద్యులు ముద్రగడకు వెంటనే చికిత్స అందించారు. ఈ క్రమంలో డయాలసిస్ చేయడంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే.. ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ముందుగా ముద్రగడను, కుటుంబసభ్యులు ఆయన కోరికపై కిర్లంపూడిలోని ఇంటికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు.

ఈ క్రమంలో తీవ్ర అస్వస్తతకు గురైన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను హైదరాబాద్‌లోని యశోద హస్పిటల్‌కు తరలించారు. ఈ విషయాన్ని ఆయన కూతురు క్రాంతి ట్విట్టర్(X) వేదికగా తెలియజేశారు. ముద్రగడకు మెరుగైన వైద్యం అందుతుందని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆస్పత్రిలో తన తండ్రిని చూసేందుకు అనుమతించాలని యశోద యాజమాన్యాన్ని బార్లపూడి క్రాంతి కోరారు. ముద్రగడ ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. మా నాన్న ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులు ఎందుకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయడం లేదని ఆమె నిన్న ప్రశ్నించారు. నాన్న ముద్రగడని కాకినాడలో మూడు హాస్పిటల్స్‌ తిప్పారని.. హైదరాబాద్‌ తీసుకెళ్లి ఎందుకు చికిత్స చేయించడం లేదని క్రాంతి ప్రశ్నించిన విషయం తెలిసిందే.

Next Story