కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా.. కింద పడిన కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లిన వాహనదారులు, స్థానికులు(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-13 09:24:49  IST  )

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా.. కింద పడిన కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లిన వాహనదారులు, స్థానికులు(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై కూల్‌డ్రింక్స్ లోడుతో వెళుతున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. వ్యాన్ బోల్తా పడడంతో అందులో ఉన్న కూల్‌డ్రింక్స్ కింద పడిపోయాయి. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కూల్ డ్రింక్ కేసులను స్థానికులు, వాహనదారులు పోటీపడి మరీ ఎత్తుకెళ్లారు.

ప్రమాదానికి గురైన వారికి సాయం చేయాల్సింది పోయి కూల్ డ్రింక్స్ తీసుకునే పనిలో మునిగిపోయారు. ఈ క్రమంలో చేతికి దొరికినన్ని కూల్ డ్రింక్స్ బాటిల్, కేసులను వారు తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ దుర్ఘటన పై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఈ క్రమంలో రహదారిపై అడ్డంగా పడిన వ్యాన్‌ను తొలగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://x.com/Tolivelugu/status/1922202564981858626

Next Story